వాట్సాప్ గ్రూప్ లో ఇంతమంది పెళ్లిళ్లు చేసేసుకున్నారా ?
on Nov 28, 2024
మింగిల్ కావొద్దు మావా సింగల్ లైఫ్ చాలా బాగుంటుంది...సోలో బతుకే సో బెటరు లాంటి కామెంట్స్ వింటూ ఉంటాం.. సింగల్ లైఫ్ మీద పాటలు కూడా ఎన్నో ఉన్నాయి. ఐతే మన ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది సింగిల్స్ ఉన్నారు. సోలో లైఫ్ అనుకోండి అంతకంటే హ్యాపీ లైఫ్ అనేది ఇంకోటి ఉండదు అనుకుంటారంతా. ఇండస్ట్రీలో హీరో నవదీప్ కూడా ఎప్పుడూ ఇదే మాట అంటూ ఉంటాడు. ఇలా సింగిల్స్ ఉన్న ఫొటోస్, వీడియోస్ వంటివే ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సింగిల్స్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి రీసెంట్ గా ఒక పిక్ పోస్ట్ చేసాడు. అందులో ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ ఉంది.
అదేంటంటే సింగల్ కింగులం అనే ఈ వాట్సాప్ గ్రూప్ లో నవదీప్ తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఉన్నారు. ఇక్కడి వరకు ఒకే. కానీ సడెన్ గా ఒక్కొక్కరిగా లెఫ్ట్ ఐపొతూ కనిపించారు. ఎవరెవరంటే కిరణ్ అబ్బవరం, నారా రోహిత్, నాగ చైతన్య, శ్రీ సింహ, డాక్టర్ క్రిష్, అఖిల్, సుబ్బరాజు వీళ్లంతా ఒకేసారి లెఫ్ట్ ఇపోయారు...అంతమంది ఒక్కసారిగా లెఫ్ట్ ఐపోయేసరికి నవదీప్ కి పాపం బాధగా అనిపించి ఉంటుంది. ఏంటి బాబాయిలు అంతా అలా వెళ్లిపోయారు అంటూ ఆ వాట్సాప్ గ్రూప్ లో నవదీప్ రిప్లై ఇచ్చేసరికి సోలో బాయ్ సాయిధరంతేజ్ మాత్రం సోలో బతుకే సో బెటర్ అని రిప్లై ఇచ్చారు. ఇలా అందరూ పెళ్లిళ్లు చేసుకున్నారు, త్వరలో పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు...వాళ్లంతా మింగిల్ ఇపోయారు కాబట్టి ఇంకెందులే ఈ వాట్సాప్ గ్రూప్ అనుకుని అందరూ లెఫ్ట్ ఇపోయారు. మరి ఇంకా పెండింగ్ లో ఉన్న ఎలిజిబుల్ బాచిలర్స్ ఎప్పుడు చేసుకుంటారో చూడాలి.